బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 22, 2020 , 11:01:57

బాలీవుడ్‌ని ఏల‌నున్న బుట్ట బొమ్మ‌..!

బాలీవుడ్‌ని ఏల‌నున్న బుట్ట బొమ్మ‌..!

టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న‌ పూజాహెగ్డే  ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటుంది. . ఇటీవల విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ‘అల వైకుంఠపురం’తో ఈ భామ క్రేజ్‌ మరింత పెరిగింది.  ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘జాన్‌', అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటిస్తున్న పూజా తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాందించుకుంది.

ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో బాలీవుడ్‌ జనాలను ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే .. సల్మాన్‌ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’  చిత్రంలో న‌టిస్తుంది. తాజాగా అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న న‌టించే ఆఫ‌ర్ అందుకుంద‌ని అంటున్నారు.  ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలోనే  తెరకెక్కుతోన్న `బచ్చన్ పాండే`లోనూ హీరోయిన్ గా సెలక్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా పూజాని ఎంపిక చేశారట. ఈ చిత్రాలతో పూజా బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. 


logo