మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 23:29:56

చారిత్రక ప్రేమికులే స్ఫూర్తి!

చారిత్రక ప్రేమికులే స్ఫూర్తి!

కరోనా ప్రభావం వల్ల ఏర్పడిన సరికొత్త పరిస్థితులకు అలవాటుపడటం మినహా మరో మార్గం లేదని చెప్పింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. ఈ అమ్మడు ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అక్కడి షూటింగ్‌ అనుభవాల గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ ‘చిన్న సెట్‌లో అతికొద్దిమంది యూనిట్‌ సభ్యులతో షూటింగ్‌ చేస్తున్నాం. వైరస్‌ నుంచి రక్షణకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.  అయితే కెమెరా ముందు మాస్క్‌ తీసేయాలి కాబట్టి తప్పకుండా కొద్దిగా రిస్క్‌ ఉంటుంది. 

ఏదిఏమైనా లైఫ్‌ కొనసాగాలంటే కొత్త జీవనశైలికి అలవాటుపడాల్సిందే. తొలి రెండు రోజులు కాస్త భయంగా అనిపించినా..ఇప్పుడు అంతా సర్దుకుంది’ అని చెప్పింది. సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ‘ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేయడం లేదు. చాలా మంది పురాణాల్లోని ‘రాధ’ పాత్ర అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు. చారిత్రక ప్రేమికులు స్ఫూర్తిగా నాయకానాయికల పాత్ర చిత్రణ సాగుతుంది. నటిగా నా ప్రతిభను ప్రదర్శించడానికి ఈ పాత్ర దోహదపడుతుంది’ అని తెలిపింది. ‘రాధేశ్యామ్‌' చిత్రానికి రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.


logo