గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 18, 2020 , 19:33:31

పూజా హేగ్డేకు నాలుగుకోట్ల పారితోషికం?

పూజా హేగ్డేకు నాలుగుకోట్ల పారితోషికం?

టాలీవుడ్‌లో వన్‌ఆఫ్‌ ద మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే. ఇటీవల విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ‘అల వైకుంఠపురం’తో ఈ భామ క్రేజ్‌ మరింత పెరిగింది. ‘అల వైకుంఠపురంలో’ చిత్రానికి 2కోట్ల పారితోషికం అందుకున్న ఈ అందాలభామ ఇప్పుడు తెలుగులో మూడు కోట్లు డిమాండ్‌ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘జాన్‌', అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటిస్తున్న పూజాకు తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాందించుకుంది.

ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో బాలీవుడ్‌ జనాలను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు సల్మాన్‌ఖాన్‌తో నటించనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ చిత్రానికి 4 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసిందట. ఇక పూజా హెగ్డేకు వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ చిత్ర నిర్మాత సాజిద్‌ నడియాలా కూడా ఆమె డిమాండ్‌కు అంగీకరించాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 


logo