గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 02, 2020 , 23:27:44

ఆ విద్య తెలిస్తే చాలు

ఆ విద్య తెలిస్తే చాలు

లాక్‌డౌన్‌ టైమ్‌ను తారలు ఏమాత్రం వృథా చేయడం లేదు. తమకు ఇష్టమైన వ్యాపకాల్ని ఆస్వాదిస్తూనే మరోవైపు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా మంగళూరు బ్యూటీ పూజాహెగ్డే ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ లాక్‌డౌన్‌ విరామాన్ని ఎలా గడుపుతున్నారని అడగ్గా...అధిక సమయాన్ని తినడం, సినిమాలు చూడటం, నిద్రపోవడం కోసమే కేటాయిస్తున్నానని పేర్కొంది. అయితే ఫిట్‌నెస్‌ విషయంలో  ఏమాత్రం రాజీపడటం లేదని..శారీరకధారుడ్యం కోసం రోజువారి కసరత్తుల్ని ఇంట్లోనే చేస్తున్నానని చెప్పింది. మీ మోముపై చెదిరిపోని చిరునవ్వుకి కారణమేంటని ఓ అభిమాని ప్రశ్నించగా..‘జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకొను. క్లిష్ట పరిస్థితులు ఎదురైతే గతంలో నన్ను బాగా సంతోషపెట్టిన సంఘటనల్ని తలచుకొని ధైర్యాన్ని తెచ్చుకుంటాను. ముఖ్యంగా ఎలాంటి సమస్యలున్నా ఇతరుల్ని నవ్వించే ప్రయత్నం మానను. ఆ విద్య తెలిస్తే చాలు   మన బాధలన్నీ మరచిపోవడానికి’ అని సమాధానమిచ్చింది. చివరగా తెలుగు  అభిమానుల గురించి ఒక్క ముక్కలో చెప్పమని కోరగా ‘వారే నా జీవితం’ అని పేర్కొంది.logo