బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 13:18:01

‘డిక్టేటర్’‌ విలన్‌ వెడ్డింగ్‌ ఫొటోలు వైరల్

‘డిక్టేటర్’‌ విలన్‌ వెడ్డింగ్‌ ఫొటోలు వైరల్

 డిక్టేటర్‌ చిత్రంలో విలన్‌గా కనిపించిన బాలీవుడ్‌ నటుడు నవాబ్‌ షా తొలి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. పూజాబత్రా, నవాబ్‌ షా పెళ్లై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పూజాబత్రా తన పెళ్లి వేడుక సమయంలో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసుకుంది. జీవితాన్ని ముందుకు నడిపించే ఒకే ఒక్క క్షణం..నవాబ్‌ షాకు తొలి వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ పూజా బత్రా వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

నవాబ్‌ షా, పూజా బత్రా వెడ్డింగ్‌ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. నవాబ్‌ షా  తెలుగులో బాలకృష్ట నటించిన డిక్టేటర్‌లో విలన్‌గా కనిపించాడు. దీంతోపాటు సల్మాన్‌ఖాన్‌తో టైగర్‌ జిందా హై, దబాంగ్‌-3, షారుక్‌ఖాన్‌తో డాన్‌-2 చిత్రాల్లో నటించాడు. 

‘’


logo