గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Jun 29, 2020 , 16:36:24

సుశాంత్ మృతి కేసులో కొత్త ట్విస్ట్

సుశాంత్ మృతి కేసులో కొత్త ట్విస్ట్

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆక‌స్మిక మ‌ర‌ణంపై ముంబై పోలీసుల బృందం ద‌ర్యాప్తు కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. సుశాంత్ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్ప‌టికే 27 మందిని విచారించారు. ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఇదిలాఉంటే ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెల‌కొంది. సుశాంత్ సింగ్, రియా చ‌క్ర‌వ‌ర్తి మంచి స్నేహితుల‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

అయితే పోలీసుల ద‌ర్యాప్తులో రియా సోద‌రుడు శోవిక్ చ‌క్ర‌వ‌ర్తి సుశాంత్ సింగ్ కు బిజినెస్ పార్ట్ న‌ర్ గా ఉన్న‌ట్లు గుర్తించార‌ట‌. సుశాంత్ కు సంబంధించిన ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ‌స్సు) కంపెనీ వివిడ్రేజ్ రియాలిటిక్స్ కంపెనీలో శోవిక్ చ‌క్ర‌వ‌ర్తి భాగ‌స్వామిగా ఉన్నాడ‌ని సమాచారం.

ఈ సంస్థ 2019లో రియా చేతుల‌మీదుగానే లాంఛ్ అయిన‌ట్లు గుర్తించార‌ట పోలీసులు. అయితే రియా మాత్రం ఈ విష‌యాన్ని పోలీసులు స్టేట్ మెంట్ లో చెప్ప‌న‌ట్టు తెలుస్తోంది‌. రియా సోద‌రుడి వ్య‌వ‌హారాన్ని దాస్తుండ‌టంతో..సుశాంత్ మృతి కేసులో పోలీసుల‌కు కొత్త అనుమానాల‌కు తావిస్తోంది. ఈ మేర‌కు శోవిక్ చ‌క్ర‌వ‌ర్తికి కూడా పోలీసులు స‌మ‌న్లు జారీచేసిన‌ట్లు స‌మాచారం. పూర్తి వివ‌రాల‌పై స్ప‌ష్టత రావాలంటే పోలీసుల ద‌ర్యాప్తు కంప్లీట్ అవ్వాల్సి ఉంది.