బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 16:51:57

సోద‌రిని స‌మ‌ర్ధించినందుకు కంగ‌నాపై కేసు

సోద‌రిని స‌మ‌ర్ధించినందుకు కంగ‌నాపై కేసు

బాలీవుడ్ సిస్ట‌ర్స్ కంగ‌నా ర‌నౌత్‌, ఆమె సోద‌రి రంగోలి ఎప్పుడు ఎదో ఒక వివాదంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. ఇటీవ‌ల కంగ‌నా సోద‌రి రంగోలి ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్‌ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  ఒక నిర్ధిష్ట వర్గానికి  చెందిన వారిని, సెక్యూలర్‌ మీడియాను కాల్చి చంపాలని రంగోలి ట్వీట్‌ చేశారు.  ఒక వ‌ర్గంపై రంగోలి ద్వేష‌పూరిత‌ వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని బాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ప్పుప‌ట్ట‌డంతో ఆమె ట్విట్ట‌ర్‌ని బ్లాక్ చేశారు.

రంగోలి ట్విట్ట‌ర్‌ని బ్లాక్ చేయ‌డాన్ని కంగ‌నా ర‌నౌత్ తప్పు ప‌ట్టారు. అంతేకాదు రంగోలి చేసిన వ్యాఖ్య‌ల‌ని స‌మ‌ర్ధించ‌డ‌మే కాకుండా స‌ద‌రు వ‌ర్గానికి చెందిన వారు టెర్రరిస్ట్ లు అని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ముంబైకి చెందిన అడ్వకేట్‌ అలీ కాషిఫ్‌ ఖాన్‌ దేశ్‌ముఖ్‌ కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో వారు ఆమె కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు 


logo