గురువారం 28 మే 2020
Cinema - May 05, 2020 , 19:45:56

శ్రీ‌ముఖిపై కేసు న‌మోదు!.. ఎందుకంటే?

శ్రీ‌ముఖిపై కేసు న‌మోదు!.. ఎందుకంటే?

బిగ్‌బాస్ సీజ‌న్ 3లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన శ్రీ‌ముఖి చిన్న పాత్ర‌ల‌తో సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత యాంక‌రింగ్ వైపు అడుగులు వేసింది.  బుల్లితెర‌పై యంగ్ యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌ముఖిపై కేసు న‌మోదైంది. 

ఈ విష‌యం తెలియ‌గానే అభిమానులంతా ఖంగారు ప‌డుతున్నారు. కార‌ణం ఏంట‌ని ఆరా తీస్తున్నారు. ఇంత‌కీ శ్రీ‌ముఖి ఏం చేసిందంటే.. శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన ఓ షోలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా.. వాళ్లను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిందంటూ శర్మ అనే వ్య‌క్తి బంజారాహిల్స్‌లోని పోలీసులను ఆశ్రయించారు. శ్రీ‌ముఖితో పాటు ఆ ప్రముఖ ఛానెల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. 


logo