శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 19:13:58

`పాయిజ‌న్` మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ

`పాయిజ‌న్` మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ షురూ

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌విఆర్ మీడియా శోభారాణి త‌న‌యుడు ర‌మ‌ణ‌ని హీరోగా ప‌రిచ‌యమ‌వున్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `పాయిజ‌న్‌`(వ‌ర్కింగ్ టైటిల్‌). చిత్రం సిఎల్ఎన్ మీడియా ప‌తాకంపై ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కె. శిల్పిక‌, ప్ర‌వ‌ల్లిక నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సిమ్రన్‌, సారిక‌, అర్ఛ‌న‌, శివ‌ణ్య హీరోయిన్స్‌గా న‌టిస్తుండ‌గా..న‌టుడు ష‌ఫీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. హైద‌రాబాద్ లోని సంస్థ కార్యాల‌యంలో ఈ మూవీ షూటింగ్‌ పూజా కార్య‌క్ర‌మాల‌తో నేడు  ప్రారంభ‌మైంది. ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర‌న్ తొలి స‌న్నివేశాన్ని హీరో ర‌మ‌ణ‌, హీరోయిన్స్  సిమ్రన్‌, సారిక‌, అర్ఛ‌న‌, శివ‌ణ్యలపై తెర‌కెక్కించార . ఇవాళ్టి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. 

ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర‌న్ మాట్లాడుతూ -``ఈ మూవీ ఒక డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌. ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్ర‌తిక్ష‌ణం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. శోభారాణి నిర్మాణంలో మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆమెకు నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.  ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్ క‌థ‌ కాబ‌ట్టి ఎంతో మంది  థియేట‌ర్ ఆర్టిస్టులను ఆడిష‌న్ చేసి హీరో హీరోయిన్ల‌ను ఎంచుకోవ‌డం జ‌రిగింది. ఈ స‌బ్జెక్ట్‌కి హీరో ర‌మ‌ణ ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌. అలాగే ఈ సినిమాలో  ప్ర‌ముఖ‌ ద‌ర్శకుడు బాలా దగ్గ‌ర వ‌ర్క్ చేసిన సినిమాటోగ్రాఫ‌ర్ ముత్తు కుమ‌ర‌న్ విజువ‌ల్స్ థ్రిల్ చేస్తాయి. ‌‌ఈ అవ‌కాశం ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌న్నారు. ఒక మంచి సినిమాలో భాగ‌మైనందుకు హ్యాపీగా ఉంద‌ని న‌టుడు ష‌ఫీ అన్నారు. 

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు కె.శిల్పిక‌, ప్ర‌వ‌ల్లిక  మాట్లాడుతూ..ఈ క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత  ఒక కొత్త మూవీని ఎనౌన్స్ చేయ‌డం హ్యాపీగా ఉంది.  ఈ చిత్రానికి మంచి స‌బ్జెక్ట్‌తో పాటు మంచి ఆర్టిస్టులు,టెక్నీషియ‌న్స్ తో కూడిన టీమ్ కుదిరింది.  త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌కి ఒక ఫీల్‌గుడ్ మూవీ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించేందుకు ఇక్క‌డికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్టు పేర్కొన్నారు. సంగీత ద‌ర్శ‌కుడు నేహ‌ల్ డీజే మాట్లాడుతూ..ఈ సినిమాలో  టెక్నిక‌ల్‌గా ది బెస్ట్ సౌండ్‌ని మీరు ఎక్స్‌పీరియ‌న్స్ చేయ‌బోతున్నారు`` అన్నారు

హీరో ర‌మ‌ణ మాట్లాడుతూ..సిఎల్ఎన్ మీడియా సంస్థ ద్వారా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నందుకు ల‌క్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ  అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు  శిల్పిక‌, ప్ర‌వ‌ల్లిక, సిరాజ్ కు నా ధ‌న్య‌వాదాలు.  ప్ర‌తి ఒక్క‌రిని ఎంట‌ర్టైన్ చేస్తూనే అనుక్ష‌ణం ఉత్కంఠకు గురిచేసే స‌బ్జెక్ట్‌. నా బెస్ట్ పెర్‌ఫామెన్స్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సిరాజ్, ఆర్టిస్ట్ కో ఆర్డినేట‌ర్ మిథిలేష్ తివారి, లొకేష‌న్ ఇంచార్జ్ పి. వైష్ణ‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.


ర‌మ‌ణ‌, ష‌ఫీ, సిమ్రన్‌, సారిక‌, అర్ఛ‌న‌, శివ‌ణ్య త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి 

సినిమాటోగ్ర‌ఫి: ముత్తు కుమ‌ర‌న్‌,

సంగీతం: నేహ‌ల్ డీజే,

ఆర్టిస్ట్ కో ఆర్డినేట‌ర్: మిథిలేష్ తివారి,

లొకేష‌న్ ఇంచార్జ్‌: పి. వైష్ణ‌వి,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సిరాజ్‌,

పిఆర్ఓ:  వ‌ంశీ- శేఖ‌ర్‌,

నిర్మాత‌లు: కె. శిల్పిక‌, కె. ప్ర‌వ‌ల్లిక‌,

ద‌ర్శ‌క‌త్వం: ర‌విచంద్ర‌న్‌.




లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.