శుక్రవారం 03 జూలై 2020
Cinema - Mar 08, 2020 , 19:56:02

నారీ శక్తి అవార్డు గ్రహీతలతో ప్రధాని మోదీ సమావేశం

నారీ శక్తి అవార్డు గ్రహీతలతో ప్రధాని మోదీ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నారీ శక్తి పురస్కారాలు అందుకున్న మహిళలతో సమావేశమయ్యారు. మీరంతా మీ పనిని ప్రారంభించి..ఓ యజ్ఞంలా పూర్తిచేశారని పురస్కారాలు అందుకున్న మహిళలను ప్రధాని మోదీ కొనియాడారు. మీరు ఎలాంటి రివార్డుల కోసమో కాకుండా.. జీవితంలో ఏదైనా విలువైన పని చేయాలన్న సంకల్పంతో పనిచేశారు. మీరంతా దేశంలోని ఎంతోమందికి ఆదర్శప్రాయమని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతోపాటు వివిధ విభాగాల్లో నారీ శక్తి పురస్కారాలు పొందిన మహిళామణులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు నారీ శక్తి పురస్కారాలు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. 


logo