ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 10, 2020 , 15:09:47

ఈ నెల 15న పీఎం న‌రేంద్ర‌మోదీ బయోపిక్ రీరిలీజ్

ఈ నెల 15న  పీఎం న‌రేంద్ర‌మోదీ బయోపిక్ రీరిలీజ్

లాక్‌డౌన్ వ‌ల‌న దాదాపు ఏడు నెల‌లుగా మూత‌బ‌డ్డ థియేట‌ర్స్ ఈ నెల 15 నుండి తెర‌చుకోనున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల ప్ర‌కారం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్ న‌డ‌ప‌నున్నారు. అయితే అక్టోబ‌ర్ 15న ఏ సినిమా విడుద‌ల అవుతుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌ని అక్టోబ‌ర్ 15న‌ రీరిలీజ్ చేయ‌బోతున్నట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.  

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జీవిత నేప‌థ్యంలో  ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ రూపొంద‌గా, ఈ చిత్రాన్ని 2019 ఎల‌క్ష‌న్స్ ముందు రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌డంతో రిజ‌ల్ట్స్ త‌ర్వాత అంటే మే 24,2019న  చిత్రాన్ని రిలీజ్ చేశారు.  చాయ్ వాలా నుంచి భారత ప్రధానిగా మోదీ జీవిత పయనం ఎలా సాగిందో ఈ సినిమా లో చూపించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ నిర్మించారు. వివేక్ ఒబేరాయ్ ప్ర‌ధాన పాత్ర పోషించారు.

పీఎం నరేంద్రమోదీ బయోపిక్ రిలీజ్ స‌మ‌యంలో అనేక వివాదాలు తలెత్త‌డంతో సినిమాకు క‌లెక్ష‌న్స్ అంత‌గా రాలేదు. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్స్ ఓపెన్ అయిన త‌ర్వాత చిత్రాన్ని తిరిగి రిలీజ్ చేయాల‌ని నిర్మాత సందీప్ సింగ్ భావించారు‌.  రీరిలీజ్ చేయాల‌నే ఉద్దేశంతోనే చిత్రాన్ని ఓటీటీ లేదా టీవీలో కూడా ప్ర‌సారం చేయ‌లేదు. ఈ సినిమాని వెండితెర‌పై మ‌రోసారి చూడాల‌ని ప్ర‌జ‌లు ఆశిస్తున్నారు. మ‌హ‌మ్మారి కార‌ణంగా థియేట‌ర్స్ అన్నీ మూత‌ప‌డ్డాయి. కాని రానున్న కాలంలో మంచి రోజులు వ‌స్తాయి. ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొని థియేటర్స్‌కు వ‌స్తార‌ని నేను ఆశిస్తున్నాను అని సందీప్ అన్నారు.



logo