సోమవారం 13 జూలై 2020
Cinema - Mar 21, 2020 , 00:56:49

జనతా కర్ఫ్యూ పాటించండి

జనతా కర్ఫ్యూ పాటించండి

రోజురోజుకు ఉధృతమవుతూ ప్రజారోగ్యానికి పెనువిపత్తుగా పరిణమించిన కరోనా మహమ్మారిని పారద్రోలడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ కోవలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకు దేశ ప్రజలంతా స్వచ్ఛంద గృహనిర్భంధం కావాలని ప్రధాని కోరారు. ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు.  ప్రతి ఒక్కరూ ఆదివారం  జనతా కర్ఫ్యూను ఆచరించాలని అభ్యర్థిస్తున్నారు.


‘జనతా కర్ఫ్యూకు నేను సంపూర్ణ మద్దతునిస్తున్నా. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో పౌర  సమాజమంతా బాధ్యతతో మెలగాలి. ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితమై జనతా కర్ఫ్యూని విజయవంతం చేయండి. ఒక్కరిగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి’ 

- అమితాబ్‌ బచ్చన్‌


‘ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో ప్రజలంతా అసాధారణ నిర్ణయాల్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఈ మహమ్మారిని పారద్రోలడానికి మనందరం కలిసికట్టుగా పోరాడాలి. జనతా కర్ఫ్యూ రోజున అందరు ఇంటికే పరిమితం కావాలి’   

- కమల్‌హాసన్‌‘ఈ క్షిష్ట పరిస్థితుల్ని అధిగమించాలంటే స్వీయ నియంత్రణ, అవగాహనే మార్గం. జనతా కర్ఫ్యూ రోజు ప్రజలందరు ఇళ్లకే పరిమితమై  మన సంకల్ప బలాన్ని చాటాలి’ 

- అనుష్కశర్మ‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనమంతా సంఘటితంగా ఉన్నామని ప్రపంచానికి తెలియజేయాలి. సామాజిక దూరాన్ని పాటించి వైరస్‌ను నిలువరించండి. జనతా కర్ఫ్యూలో అందరు భాగం కావాలని కోరుకుంటున్నా’ 

- అక్షయ్‌ కుమార్‌

‘జనతా కర్ఫ్యూ అద్భుతమైన ఆలోచన. మన క్షేమంతో పాటు ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న వారికి ఓ కృతజ్ఞతగా ఆరోజు అందరం స్వచ్ఛంద నిర్భంధంలో ఉందాం’ 

- మాధవన్‌


logo