ఆదివారం 05 జూలై 2020
Cinema - Jun 18, 2020 , 21:20:59

మ్యాచ్ ఫిక్సింగ్ ముసాయిదాకు ఇమ్రాన్ ఖాన్ ఆమోదం

మ్యాచ్ ఫిక్సింగ్ ముసాయిదాకు ఇమ్రాన్ ఖాన్ ఆమోదం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో అవినీతి నిరోధక కోడ్ ను సవరించడానికి, మ్యాచ్ ఫిక్సింగ్ ను నేరంగా పరిగణించే ముసాయిదాకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రామన్ ఖాన్ ఆమోదం తెలిపారు. పీసీబీ చైర్మన్ ఈసన్ మని ఇటీవలే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కలిసిన నేపథ్యంలో ఇమ్రాన్ ఆమోదముద్ర వేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీని సమర్థిస్తూ..న్యాయశాఖ పరిధి, సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చిన తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టి..చట్టంగా రూపకల్పన చేయెచ్చని ప్రధాని ఇమ్రాన్ పీసీబీ ఛైర్మన్ ఈసన్ మనికి నిర్దేశించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కొత్త చట్టం పీసీబీలో అవినీతిని నిరోధిస్తాయని తెలిపారు. కొత్త చట్టాలు భద్రతా విభాగానికి ఆటగాళ్ళు, అధికారుల, వ్యక్తుల నుండి డబ్బు మార్గాలు, ఆస్తులపై దర్యాప్తు చేయటమే కాకుండా అవసరమైన చోట దాడులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారాన్నిఇస్తాయన్నారు. 


logo