శనివారం 30 మే 2020
Cinema - Apr 30, 2020 , 11:56:15

రిషీ మ‌ర‌ణం ఎంత‌గానో బాధించింది: ప‌్ర‌ధాని

రిషీ మ‌ర‌ణం ఎంత‌గానో బాధించింది: ప‌్ర‌ధాని

గ‌త రెండేళ్ళుగా క్యాన్స‌ర్‌తో ఫైట్ చేస్తూ వ‌స్తున్న‌ రిషీ క‌పూర్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ముంబై లోని హెచ్ ఎన్ రిల‌య‌న్స్ ఆసుప‌త్రిలో ఉద‌యం 8.45నిల‌.కి రిషీ కపూర్ మృతి చెందిన‌న‌ట్టు కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. రిషీ మృతికి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ట్విట్ట‌ర్ ద్వారా నివాళులు అర్పించారు.

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి, మ‌నోహ‌రం, ఉల్లాస‌వంతంగా ఉండే మ‌నిషి రిషీ కపూర్. అతను ప్ర‌తిభ‌కి పెద్ద శ‌క్తిలా ఉండేవారు. సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు గ‌తంకి సంబంధించిన జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకుంటూ ఉంటాము. సినిమాలే కాక భార‌తదేశం పురోగ‌తి ప‌ట్ల ఎంతో మ‌క్కువ చూపించారు. అత‌ని మ‌ర‌ణం న‌న్ను చాలా బాధ‌కి గురి చేసింది. ఆయ‌న కుటుంబానికి, అభిమానుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని మోడీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక ఉప రాష్ట్ర‌పతి వెంక‌య్య నాయుడు.. రిషీ మృతిపై స్పందిస్తూ,  హిందీ సినిమా సీనియర్ నటుడు శ్రీ రిషి కపూర్ యొక్క అకాల మరణ వార్త చూసి నేను షాక్ అయ్యాను. అతను తన బహుముఖ నటనా ప్రతిభతో దశాబ్దాలుగా భారతీయ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాడు . అంతేకాక ఆ పాత్రలను మన మ‌న‌సుల‌లో నిలిపేలా చేశారు. ఆయ‌న‌కి నా సంతాపం తెలియ‌జేస్తున్నాను అని ట్వీట్ చేశారు. 


logo