ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 14:30:32

అభిమానులెవ‌రూ నా ఇంటికి రావొద్దు

అభిమానులెవ‌రూ నా ఇంటికి రావొద్దు

క‌న్న‌డ హీరో ధ్రువ సార్జా త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులెవ‌రూ త‌న ఇంటికి రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. ధ్రువ సార్జా నేటితో 32వ ప‌డిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ధ్రువ సార్జాకు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ ఏడాది ధ్రువ సార్జా ఫ్యామిలీచిరంజీవి సార్జా  ( ధ్రువ సోద‌రుడు)ను కోల్పోవ‌డం, మ‌రోవైపు క‌రోనా ప్ర‌భావం ఉన్న నేప‌థ్యంలో అభిమానులు ఇంటికి రావొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశాడు.

అభిమానులు మాకు అన్నం పెట్టే వ్య‌క్తులు. ప్ర‌తీ ఏడాది మీరంతా నా బ‌ర్త్ డేకు మా ఇంటికొస్తారు. ఈ ఏడాది ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌మో అంద‌రికీ తెలుసు. కాబ‌ట్టి ద‌య‌చేసి అభిమానులెవ‌రూ మా ఇంటికి రావొద్ద‌ని ధ్రువ సార్జా విజ్ఞ‌ప్తి చేశాడు. ఈ మేర‌కు ట్వీట్ ద్వారా త‌న సందేశాన్ని తెలియ‌జేశాడు. ధ్రువ సార్జా, ర‌ష్మిక మంద‌న్నా కాంబినేష‌న్ లో పొగ‌రు సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo