ఆదివారం 29 నవంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 19:40:09

ద‌య‌చేసి నా ఫొటోలు డిలీట్ చేయండి: జైరా వ‌సీమ్

ద‌య‌చేసి నా ఫొటోలు డిలీట్ చేయండి: జైరా వ‌సీమ్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ లీడ్ రోల్ లో న‌టించిన చిత్రం దంగ‌ల్. రెజ్లింగ్ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ చిత్రంలో బ‌బితా ఫోగ‌ట్ చెల్లెలు గీతా ఫోగ‌ట్ (చిన్న‌నాటి పాత్ర‌)రోల్ లో జైరావ‌సీమ్  న‌టించి మంచి మార్కులు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా (చైల్డ్ ఆర్టిస్ట్‌) రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. అయితే త‌న‌కు వ‌చ్చే పాత్ర‌ల ద్వారా త‌మ మ‌త‌విశ్వాసాన్ని కోల్పోతున్నానని, ఇక‌పై తాను సినిమాల్లో న‌టించ‌న‌ని గ‌తేడాది జైరా ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఇన్ స్టాగ్రామ్‌లో మ‌రో పోస్ట్ పెట్టింది.

మీ అంద‌రినీ నేను చిన్న సాయం కోరుతున్నా. మీ సోష‌ల్ మీడియా ఖాతా నుంచి నా ఫొటోల‌ను తొల‌గించండి. అలాగే మిగితా ఫ్యాన్ పేజెస్ మెంబ‌ర్స్ కూడా ఈ ప‌ని చేయండి..క్యాప్ష‌న్ ఇచ్చింది. గ‌తేడాది నా ఫ్యాన్స్ పేజీలో షేర్ చేసిన మెసేజ్ ను మ‌రోసారి మీతో పంచుకుంటున్నా. మీరు ఒక‌వేళ ఇదివ‌ర‌కు చ‌దివి ఉండక‌పోతే చ‌ద‌వండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తాజా పోస్ట్‌తో..జైరావ‌సీమ్ పెండ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాల‌నుకుంటుంద‌ని గాసిప్స్ చ‌క్క‌ర్లు కొడుతోంది. 

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.