ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Aug 01, 2020 , 23:45:51

ప్లాస్టిక్‌ సర్జరీ తప్పేమీ కాదంటోంది చెన్నై సోయగం శృతిహాసన్‌

ప్లాస్టిక్‌ సర్జరీ తప్పేమీ కాదంటోంది చెన్నై సోయగం శృతిహాసన్‌

ఆకర్షణీయమైన ముఖాకృతి కోసం సినీ తారలు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవడం మామూలే. అయితే ఈ విషయాల్లో చాలా మంది గోప్యత పాటిస్తారు. ఎటువంటి సందర్భంలోనూ సర్జరీల గురించి చెప్పడానికి ఇష్టపడరు. చెన్నై సోయగం శృతిహాసన్‌ మాత్రం తనకు అలాంటి దాపరికాలు లేవని చెబుతోంది. ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవడం తప్పేమి కాదంటోంది. ఆమె మాట్లాడుతూ ‘ఎవరి ముఖాలైన అంత త్వరగా మారిపోవు. ఒక్కసారిగా పెద్ద మార్పు కనిపిస్తోందంటే సర్జరీ చేయించుకున్నట్లే అనుకోవాలి. జుట్టుకు రంగు వేసుకోవడం, కళ్లకు కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకోవడం, చర్మానికి బ్లీచింగ్‌ మాదిరిగానే ప్లాస్టిక్‌ సర్జరీ కూడా సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ఓ మార్గం. తన శరీరానికి సంబంధించిన ప్రతి నిర్ణయాల్ని స్వేచ్ఛగా తీసుకునే హక్కు మహిళలకు ఉంటుంది’ అని చెప్పింది. మొదటి సినిమా చిత్రీకరణ సమయంలో ముక్కుకు గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నానని, ఆ విషయం గురించి అందరికి చెప్పానని శృతిహాసన్‌ పేర్కొంది. సెలబ్రిటీలు కావడం వల్లే చాలా మంది ఇలాంటి విషయాల్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరని..అయితే ఒకరు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాల పట్ల విమర్శలు చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికింది.



logo