మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 21:39:45

ప్లాస్మా దానంతో ఇద్ద‌రిని కాపాడొచ్చు: నాని వీడియో సందేశం

ప్లాస్మా దానంతో ఇద్ద‌రిని కాపాడొచ్చు: నాని వీడియో సందేశం

క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాల‌ని సైబ‌రాబాద్ పోలీసులు కోరుతున్నారు. సైబ‌రాబాద్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో ప్లాస్మా దానం చేసిన వ్య‌క్తుల‌ను ఇప్ప‌టికే టాలీవుడ్ న‌టుడు విజ‌య్‌దేవ‌ర కొండ స‌న్మానించిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్లాస్మా దానం చేయాల‌ని న‌టుడు నాని విజ్ఞ‌ప్తి చేశారు.  కొన్ని లక్ష‌ల మందికి కోవిడ్-19 సోకింది. కొన్ని ల‌క్ష‌ల మందికి క‌రోనా వ‌చ్చి..పోయింది. అయతే త‌గ్గిపోయిన వాళ్ల ద‌గ్గ‌ర మంచి అవ‌కాశముంది. మీరు దానం చేసే ప్లాస్మా వ‌ల్ల‌ అవ‌స‌రాల్లో ఉన్న వారిని ఆదుకోగ‌లగ‌డం, కోవిడ్ -19 వ‌ల్ల న‌ష్ట‌పోయిన వారిని కాపాడుకోవ‌చ్చ‌న్నారు.

మీ ప్లాస్మా దానం చేయ‌డం వ‌ల్ల ఇద్ద‌రు జీవితం కాపాడ‌వ‌చ్చు. మీరు దానం చేసిన ప్లాస్మా 2,3 రోజుల్లో మ‌ళ్లీ మీ శ‌రీరంలో త‌యార‌వుతుంది. ఇంత చిన్న సాయంతో గొప్ప సంతృప్తి ల‌భిస్తుంది అని నాని ఓ వీడియో సందేశాన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. ‌ 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo