గురువారం 28 మే 2020
Cinema - May 14, 2020 , 14:22:42

ఈ ఇద్ద‌రు హీరోయిన్లు అయితే బాగుంటుంద‌ట‌..!

ఈ ఇద్ద‌రు హీరోయిన్లు అయితే బాగుంటుంద‌ట‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీశ్ శంక‌ర్ క్రేజీ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రానుంద‌ని వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ 28వ సినిమాగా రాబోతున్న కొత్త చిత్రం ఈ ఏడాది చివ‌రిలో సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టులో ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ల విష‌యంలో.. అభిమానులు ఇద్ద‌రు పేర్ల‌ను సూచిస్తున్నారు. 

మ‌ల‌యాళ బ్యూటీ మాన‌స రాధాకృష్ణ‌న్ ఈ చిత్రంలో హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని ఫ్యాన్స్ అనుకుంటున్నార‌ట‌. మ‌రోవైపు ఇంకొంత‌మంది ఫ్యాన్స్ ప‌వ‌న్ కు జోడీగా అనుమ‌ప ప‌ర‌మేశ్వ‌ర‌న్ అయితే చాలా బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట. ప‌వ‌న్, హ‌రీశ్ కాంబినేష‌న్ కు అధికారికంగా గ్రీన్ సిగ్న‌ల్ ప‌డితే.. ప‌వ‌న్ అభిమానుల కోరిక మేర‌కు చిత్ర‌యూనిట్ ఎవ‌రిని హీరోగా ఎంపిక చేస్తారో చూడాలి. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo