శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 00:17:38

ఫిలిమ్‌ ఓటీటీలో ‘పిజ్జా-2’

ఫిలిమ్‌ ఓటీటీలో ‘పిజ్జా-2’

కరోనా నేపథ్యంలో థియేటర్స్‌ మూతపడటంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పట్టాయి. అందులో భాగంగానే టాలీవుడ్‌లోకి వచ్చిన మరో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఫిలిమ్‌'లో విజయ్‌సేతుపతి నటించిన ‘పిజ్జా-2’ ప్రీమియర్‌ కాబోతుంది. విజయదశమి సందర్భంగా ‘పిజ్జా-2’ను ఫిలిమ్‌లో విడుదల చేస్తున్నారు. విజయసేతుపతి సరసన గాయత్రి నాయికగా నటించిన  ఈ చిత్రానికి రంజిత్‌ జయకోడి దర్శకుడు.థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో డి.వెంకటేష్‌ నిర్మించారు.