గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 20:13:31

టాలీవుడ్ లోకి ఫిలిమ్ ఓటీటీ ఎంట్రీ.. తొలి ప్రీమియర్‌గా పిజ్జా 2

టాలీవుడ్ లోకి ఫిలిమ్ ఓటీటీ ఎంట్రీ.. తొలి ప్రీమియర్‌గా  పిజ్జా 2

టాలీవుడ్ లోకి ఫిలిమ్ పేరుతో మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ రోబోతోంది. ఫిలిమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ రాకతో తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఆహా ఓటీటీ వీక్షకుల ముందుకు రాగా..ఇప్పుడు ఫిలిమ్ సినీ వినోదాన్ని రెట్టింపు చేయబోతోంది. ఫిలిమ్ ఓటీటీ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఆహా తో పోల్చితే ఫిలిమ్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు తక్కువగా ఉండనున్నాయి. కొంతమంది యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ కలిసి ఫిలిమ్ ఓటీటీని తీసుకొస్తున్నారు. విజయదశమి పండగ ముందు ఫిలిమ్ ఓటీటీ లాంఛ్ అవుతోంది.

ఫిలిమ్ ఓటీటీలో విజయ్ సేతుపతి నటించిన పిజ్జా 2 సినిమా తొలి చిత్రంగా ప్రీమియర్ కానుంది. పిజ్జా 2 ఈ ఏడాది మార్చి 13న తమిళ నాట విడుదలైంది. రిలీజైన రెండు రోజులకే లాక్ డౌన్ మొదలు కావడం వల్ల ఈ సినిమాను ప్రేక్షకులు చూడలేకపోయారు. అందువల్ల ఈ చిత్రాన్ని ఫిలిమ్ ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నారు నిర్మాత డి వెంకటేష్. పిజ్జా 2 సినిమాను దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించారు. గాయత్రి నాయికగా నటించింది. సోనియా దీప్తి, మహిమా నంబియార్ ఇతర పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన పిజ్జా 2 ఫిలిమ్ ఓటీటీలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇవ్వనుంది.


logo