శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 13, 2021 , 21:32:15

'మాస్టర్'కు పైరసీ దెబ్బ..మధ్యాహ్నమే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం

'మాస్టర్'కు పైరసీ దెబ్బ..మధ్యాహ్నమే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం

మాస్టర్ సినిమా ఎన్ని అంచనాలతో విడుదలైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళంలో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. దాదాపు 2000 థియేటర్స్ లో విడుదల అయింది మాస్టర్. తమిళనాట పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగులో మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయినా పర్లేదు సంక్రాంతి సీజన్.. పైగా 10 నెలల గ్యాప్ వచ్చింది కాబట్టి కచ్చితంగా థియేటర్స్ కు వచ్చి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని దర్శక నిర్మాతలు నమ్మారు. ఇప్పుడు వాళ్ల నమ్మకమే నిజమవుతుంది కూడా. మొన్న క్రాక్ విడుదలైనపుడు థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపించింది. ఇప్పుడు మాస్టర్ కు కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. కరోనా వైరస్ ఉందనే విషయం కూడా చాలా మందికి గుర్తు కూడా లేదు. 

చాలా రోజుల తర్వాత భారీ సినిమాలు రావడంతో ఆడియన్స్ పండగ చేసుకుంటున్నారు. తెలుగులోనే భారీ ఓపెనింగ్స్ తీసుకొస్తున్న మాస్టర్.. తమిళనాట అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఇదిలా ఉంటే అప్పుడే ఈ చిత్ర పైరసీ విడుదల కావడం చిత్ర యూనిట్ ను కలవరపెడుతుంది. థియేటర్స్‌లో సినిమా తొలి షో పడగానే ఏదో పరుగు పందెంలో పోటీ పడుతున్నట్లుగా రెండు మూడు గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రింట్ పెట్టేసారు. ఉదయం విడుదలైన ఈ చిత్రం మ్యాట్నీ పడక ముందే ఆన్ లైన్ లో విడుదల అయిపోయింది. దాంతో మేకర్స్ పరేషాన్ అవుతున్నారు. వెంటనే పైరసీ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో పాటు నిర్మాతలు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ చిత్రంతో హ్యాట్రిక్ పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు లోకేష్. మరోవైపు తెలుగులో పర్లేదు అనిపిస్తున్నాడు మాస్టర్. పైరసీని అడ్డుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొన్ని సైట్లపై చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతున్నారు. లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. మరోవైపు తమ ఏడాదిన్నర కష్టాన్ని కన్నీటి పాలు చేయొద్దని వేడుకున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించగా.. విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మాళవిక మోహనన్ హీరోయిన్. తొలిరోజు ఈ చిత్రం రికార్డ్ వసూళ్లు సాధించేలా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరీ ఇంత త్వరగా పైరసీ రావడం మాత్రం షాక్ అయ్యేలా చేస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

స్ర‌వంతి ర‌వికిశోర్ కు త్రివిక్ర‌మ్ పాదాభివంద‌నం

రవితేజ తొలి పారితోషికం ఎంతో తెలుసా..?

మ‌తి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

అన‌సూయకు సూప‌ర్‌స్టార్ తో న‌టించే ఛాన్స్ ..?

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

‘టైమ్ ’చూసి దిగుతున్నారు

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..?లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo