శనివారం 06 జూన్ 2020
Cinema - May 22, 2020 , 08:16:44

ద‌గ్గుబాటి ఇంట రోకా వేడుక‌..!

ద‌గ్గుబాటి ఇంట రోకా వేడుక‌..!

ద‌గ్గుబాటి ఇంట పెళ్ళి సంద‌డి మొద‌లైంది. రానా త‌న ప్రేయ‌సి మిహికా బ‌జాజ్‌ని త్వ‌ర‌లో వివాహ‌మాడ‌నుండ‌గా, రీసెంట్‌గా రోకా వేడుకని నిర్వ‌హించారు. అంటే పెద్ద‌లు స్వీట్లు, గిఫ్ట్స్‌ ఇచ్చి పుచ్చుకొని పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.  బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్రమంలో ఇరు కుటుంబ‌ పెద్ద‌లు నిశ్చయ తాంబూలాలు కూడా మార్చుకున్నారు. 

రోకా వేడుక‌లో వెంక‌టేష్ ఫ్యామిలీతో పాటు నాగ చైతన్య ఫ్యామిలీ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ద‌గ్గుబాటి ఫ్యామిలీతో పాటు బ‌జాజ్ ఫ్యామిలీ క‌లిసి దిగిన గ్రూప్ ఫోటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.  డిసెంబ‌ర్‌లో రానా వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, కొద్ది రోజుల ముందు నిశ్చితార్ధం జ‌ర‌ప‌నున్నారు. 

రానా, మిహికా రోకా వేడుక ఫోటోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండిlogo