శనివారం 26 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 08:16:09

పూజా కార్య‌క్ర‌మంలో రానా దంప‌తులు

పూజా కార్య‌క్ర‌మంలో రానా దంప‌తులు

ద‌గ్గుబాటి వార‌సుడు రానా ఆగ‌స్ట్ 8న మిహికాతో ఏడ‌డుగులు వేసిన సంగ‌తి తెలిసిందే. ఇక సోమ‌వారం రానా ఇంట స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. పూజకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఫోటోలో రానా తెల్ల‌ని దుస్తుల‌లో న‌వ్వుతూ క‌నిపిస్తుండ‌గా, మిహికా ఆకుపచ్చ, బంగారు క‌ల‌గ‌ల‌సిన చేనేత చీరతో పాటు  ఎర్ర‌టి దుప్పట్టా ధ‌రించింది

స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తం త‌ర్వాత ఫ్యామిలీ అంతా నూత‌న వ‌ధూవ‌రుల‌తో ఫోటో దిగారు. ఇందులో వెంక‌టేష్ ఆయ‌న స‌తీమ‌ణి , పిల్లలు, స‌మంత‌, నాగ చైత‌న్య‌, ద‌గ్గుబాటి సురేష్ బాబు త‌దిత‌రులు ఉన్నారు. ఫ్యామిలీ ఫోటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా, రానా వివాహం రామానాయుడు స్టూడియాలో 30 మంది అతిథుల స‌మ‌క్షంలో జ‌రిగిన విష‌యం తెలిసిందే.logo