మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 09:07:04

సాహో ద‌ర్శ‌కుడు సుజీత్ పెళ్లి ఫోటోలు

సాహో ద‌ర్శ‌కుడు సుజీత్ పెళ్లి ఫోటోలు

క‌రోనా స‌మ‌యంలోను టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్ర‌ముఖులు పెళ్ళిపీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ 2న సాహో డైరెక్ట‌ర్ సుజీత్‌ కొద్ది మంది ఆత్మీయుల స‌మ‌క్షంలో ప్ర‌వ‌ల్లిక‌ని వివాహం చేసుకున్నాడు. తాజాగా ఆయ‌న పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలోచ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

ర‌న్ రాజా ర‌న్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన సుజీత్‌.. సాహో చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పొందాడు. కొన్నాళ్ళుగా ప్ర‌వ‌ల్లిక అనే అమ్మాయితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న సుజీత్ ఎట్ట‌కేల‌కి వివాహం చేసుకున్నాడు. వారి పెళ్లి నిరాడంబ‌రంగా జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.  ప్ర‌వల్లిక వృత్తి రీత్యా డాక్టర్ కాగా, ప్ర‌స్తుతం స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా ప‌నిచేస్తుంది.  టిక్ టాక్ వీడియోలలో ఆమె  బాగా ఫేమస్ అట. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.  logo