శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 12, 2020 , 11:06:27

మెగాస్టార్‌ చిరంజీవిని కదిలించిన వీడియో..!

మెగాస్టార్‌ చిరంజీవిని కదిలించిన వీడియో..!

మాతృదినోత్స‌వం రోజున మెగాస్టార్ చిరంజీవి అంద‌మైన వీడియోతో మాతృమూర్తుల‌కి మ‌హిళా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. కొద్ది సేప‌టి త‌ర్వాత మ‌రో వీడియో షేర్ చేసి ఇందులో ఓ పోలీస్ మ‌హిళ‌.. అంగ‌వైకల్యంతో బాధ‌ప‌డుతూ మ‌న‌స్థిమితం లేక రోడ్డు ప‌క్క‌న ఉన్న మ‌హిళ‌కి నోట్లో ముద్దలు క‌లిపి పెట్టింది.  పోలీస్‌లోఅమ్మ త‌నాన్ని చూసి తెగ మురిసిపోయిన చిరంజీవి స్వ‌యంగా ఆమెతో మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోని త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తాన‌ని చెప్పారు

కొద్ది సేప‌టి క్రితం పోలీస్ ఆఫీస‌ర్ శుభ శ్రీతో మాట్లాడిన సంభాష‌ణ‌ని చిరు వీడియో ద్వారా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. వారిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ ఇలా జ‌రిగింది 

చిరంజీవి: గుడ్ మార్నింగ్ శుభశ్రీ జీ

శుభశ్రీ: సర్ నమస్తే సర్

చిరు: నమస్తే నమస్తే.. ఆ శుభశ్రీ జీ.. కొన్ని రోజుల క్రితం మీ వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది.. అందులో మీరు ఓ మతి స్థిమితం లేని మహిళకి భోజనం తినిపిస్తున్నారు. అది నా మనసుని తాకింది. నన్ను చలింపజేసింది. ఆ రోజు నుంచి నేను మీతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తున్నాను. మీరు ఆ వ్యక్తి పట్ల అంత ఆదరణగా, మానవీయంగా ఉన్నందుకు  చాలా సంతోషించాను. ఎంతో బాధ్యతగా మీరు ఈ పని చేయడానికి కారణమేంటీ?

శుభశ్రీ: నేను ఆవిడకి ప్రత్యేకించి ఏమీ చేయలేదు సర్... నేను భోజనం అందించినప్పుడు ఆవిడ తినే పరిస్థితుల్లో లేదు. దీంతో నేను ఆమెకు తినిపించాను.

చిరంజీవి: మీరు చాలా మందికి స్ఫూర్తివంతంగా నిలిచారు.

శుభశ్రీ: బాధ్యతలు నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్‌ కాపాడడం మాత్రమే కాదు.. పౌరుల‌కి ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చిన స‌హాయ‌ప‌డ‌టం మ‌న క‌ర్తవ్యం . దీనిని రివార్డ్‌గా బావిస్తాను. ఆనంద్ గారు, మీరు నాతో మాట్లాడాల‌ని అనుకుంటున్నారు అని చెప్ప‌గానే చాలా ఉద్వేగం పొందాను. మీరు నాతో మాట్లాడుతుండడంతో చాలా సంతోషంగా ఉంది. మీరు మెగాస్టార్ మాత్రమే కాదు.. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సెమినార్స్‌లో పాల్గొన్నారు.

చిరంజీవి:  మీరు ఇలాంటి గొప్ప ప‌నులు ఎన్నో చేయాలి. మీతో మాట్లాడ‌డం సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ అంటూ చిరు త‌న సంభాష‌ణ ముగించారు.logo