గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Jul 10, 2020 , 10:48:04

గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిల‌ని మోసం చేసిన ప్ర‌బుద్ధుడు

గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిల‌ని మోసం చేసిన ప్ర‌బుద్ధుడు

సెల‌బ్రిటీల పేర్లు చెబుతూ అమ్మాయిల‌కి వ‌ల వేయ‌డం ఈ మ‌ధ్య కాలంలో బాగా జ‌రుగుతుంది. కొద్ది రోజుల క్రితం ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి పేరు చెప్పి అమ్మాయిల‌ని మోసం చేసిన విష‌యం వెలుగులోకి రాగా, తాజాగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పేరుతో అమ్మాయిల‌కు ఓ ప్ర‌బుద్ధుడు వ‌ల వేశాడు. 

గీతా ఆర్ట్స్‌లో తాను  డిజైనర్, మేకప్ మేన్‌ అని చెప్పుకుంటూ అమ్మాయిల‌కి అనేక మాట‌లు చెప్పి మోసం చేశాడు. ఈ విష‌యం గీతా ఆర్ట్స్ బేన‌ర్ దృష్టికి రావ‌డంతో వెంట‌నే  గీతా ఆర్ట్స్ మేనేజ‌ర్ స‌త్య సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. మోసం చేసిన వ్య‌క్తి వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడ‌డంతో అత‌ని లోకేష‌న్  ట్రేసింగ్ చేసే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo