గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 08, 2020 , 13:41:11

బన్నీ కాలుకి ఆరు వేళ్ళు.. సుకుమార్ సృష్టా?

బన్నీ కాలుకి ఆరు వేళ్ళు.. సుకుమార్ సృష్టా?

లెక్క‌ల మాస్టార్ సుకుమార్ తన రైటింగ్, మేకింగ్ టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ప్ర‌తి సినిమాలో ఏదో ఒక కొత్త ద‌నం చూపిస్తూ ఉండే సుక్కూ త‌న తాజా చిత్రం పుష్ప‌లో ఏం స‌ర్‌ప్రైజ్ ఇస్తాడా అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొని ఉంది. ఈ రోజు బ‌న్నీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇందులో హీరో లుక్ అభిమానుల‌కి మాంచి కిక్ ఇచ్చింది. రంగ‌స్థ‌లంలో రామ్ చ‌ర‌ణ్‌కి పూర్తిని మార్చేసిన సుకుమార్ ఇప్పుడు పుష్ప‌లోను బ‌న్నీని స‌రికొత్త‌గా చూపించ‌బోతున్నాడు.

బన్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రెండు పోస్ట‌ర్ లు విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. రెండో పోస్ట‌ర్‌లో బ‌న్నీ గంధ‌పు చెక్క‌లతో కింద కూర్చొని ఉన్నాడు. ఇక్కడ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమంటే అల్లు అర్జున్ ఎడ‌మ కాలికి ఆరు వేళ్లు ఉన్నాయి. ఇది అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. సుకుమార్ మార్క్ క్యారెక్ట‌రైజేష‌న్‌లో భాగ‌మా లేదంటే నిజంగానే బ‌న్నీకి ఆరు వేళ్లు ఉన్నాయా అనే చ‌ర్చ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, భాష చిత్తూరు యాస‌లో ఉంటుంద‌ట‌.


logo