శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 28, 2020 , 23:17:14

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ 25 లక్షల విరాళం

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ 25 లక్షల విరాళం

కరోనాను అరికట్టడంలో ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు సినీ ప్రముఖులు. కరోనా సహాయక చర్యల కోసం  సినీ నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌  తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇరవై ఐదు లక్షల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన సహనిర్మాత వివేక్‌ కూచిభోట్లతో కలిసి మంత్రి కేటీఆర్‌కు చెక్కును అందజేశారు. తమ సంస్థలైన పీపుల్‌ టెక్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ  ఉద్యోగుల ఒకరోజు వేతనానికి మరికొంత మొత్తాన్ని జోడించి ఈ డబ్బును అందించారాయన.  ‘క్లిష్టపరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ విపత్తు ఏర్పడింది. దీనిని నివారించడం అందరి బాధ్యత. ఈ  నివారణ చర్యలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలి’ అని టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు. logo