శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 10, 2020 , 00:41:11

మళ్లీ మొదలు కానున్న‘పెళ్లిసందడి’

మళ్లీ మొదలు కానున్న‘పెళ్లిసందడి’

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్ధేశకత్వంలో శ్రీకాంత్‌ కథానాయకుడిగా వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రం విశేషప్రజారదణ పొందిన విషయం తెలిసిందే. కమర్షియల్‌గా భారీ విజయం సాధించడంతో పాటు కీరవాణి స్వరపరచిన ఈ చిత్రగీతాలు సంగీతప్రియుల్ని ఎంతగానో మెప్పించాయి. తాజాగా ‘పెళ్లిసందడి’ పేరుతో రాఘవేంద్రరావు ఓ కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆర్కా మీడియా వర్క్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.రాధామోహనరావు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి స్వరరచన చేయనుండగా చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తారాగణం వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.


logo