ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 12:34:40

పెళ్లి సంద‌డి మ‌ళ్ళీ మొద‌ల‌వ్వ‌బోతుంది...

పెళ్లి సంద‌డి మ‌ళ్ళీ మొద‌ల‌వ్వ‌బోతుంది...

శ‌తాధిక‌చిత్రాల ద‌ర్శ‌కుడు కె రాఘ‌వేంద్ర‌రావు మ‌ళ్ళీ పెళ్లి సంద‌డి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యారు. 1996 లో రాఘవేంద్రరావు  శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలలో పెళ్ళి సంద‌డి అనే కుటుంబ క‌థా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం భారీ విజ‌యం సాధించింది. కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మ‌ళ్ళీ పెళ్లి సంద‌డి పేరుతో మూవీని రూపొందించేందుకు సిద్ధ‌మ‌య్యారు

ఆర్కా మీడియా నిర్మించ‌నున్న పెళ్ళి సంద‌డి చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా, చంద్ర‌బోస్, శివశక్తిదత్తా లిరిక్స్ ఇస్తున్నారు. రాఘ‌వేంద్ర‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం మ్యూజిక్‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లో మూవీకి సంబంధించిన న‌టీన‌టులు ఎవ‌రనేది తెలియ‌జేయ‌నున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ మూవీని కొత్త నటీన‌టుల‌తో రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, రాఘ‌వేంద్ర‌రావు చివ‌రిగా 2017లో ఓం న‌మో వెంకటేశాయ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. 


logo