రోషన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘పెళ్లి సందడి’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. గౌరీ రోనంకి దర్శకురాలు. ఈ చిత్రంలోని ‘ప్రేమంటే ఏంటీ..’అనే పల్లవితో సాగే తొలి సింగిల్‌ను బుధవారం చిత్రబృందం విడుదలచేసింది. కీరవాణి సంగీతాన్ని అందించారు. హరిచరణ్, శ్వేతపండిట్ ఈ గీతాన్ని ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చారు. ప్రేమ ఔన్యతాన్ని చాటిచెప్పే గీతమిదని చిత్రబృందం తెలిపింది.