బుధవారం 05 ఆగస్టు 2020
Cinema - Jul 04, 2020 , 08:16:35

కమల్‌తో కలిసి నటించనున్న పాయల్‌

కమల్‌తో కలిసి నటించనున్న పాయల్‌

చెన్నై : హిరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ కమలహాసన్‌తో కలిసి నటించనుంది. ఈ విషయాన్ని పాయల్‌ సన్నిహితులే ధృవీకరించారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంతో కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌-2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌ ఇది. లైక ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మింస్తోంది. ఇందులో కాజల్‌ అగర్వాల్‌, రకూల్‌ప్రీత్‌ సింగ్‌ హిరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు వారి జాబితాలోకి కొత్తగా పాయల్‌ వచ్చి చేరింది.

ఈ చిత్రంలో పాయల్‌ ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయబోతోందని తెలుస్తోంది. దర్శకుడు శంకర్‌ ఈ ప్రత్యేక గీతాన్ని భారీ సెట్టింగులతో చిత్రీకరిస్తున్నారని సమాచారం. కరోనా ప్రభావం తగ్గితే ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo