శనివారం 29 ఫిబ్రవరి 2020
మొత్తానికి త‌న ప్రేమ వ్య‌వ‌హారం బ‌య‌ట‌పెట్టిన పాయ‌ల్‌

మొత్తానికి త‌న ప్రేమ వ్య‌వ‌హారం బ‌య‌ట‌పెట్టిన పాయ‌ల్‌

Feb 14, 2020 , 13:41:52
PRINT
మొత్తానికి త‌న ప్రేమ వ్య‌వ‌హారం బ‌య‌ట‌పెట్టిన పాయ‌ల్‌

ఆర్ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ పాయ‌ల్ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయ‌ల్ ఇటీవ‌ల వెంకీమామ‌, డిస్కోరాజా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పాయల్ ఏంజెల్ అనే తమిళ్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో ఏ సినిమాకి సైన్ చేయ‌లేద‌ని తెలుస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పాయ‌ల్ రాజ్‌పుత్ కొన్ని నెల‌ల క్రితం ఓ వ్య‌క్తితో చాలా స‌న్నిహితంగా ఉన్న ఫోటోని   షేర్ చేసింది. ఈ ఫోటో చూసి పాయ‌ల్‌తో స‌న్నిహితంగా ఉన్న వ్య‌క్తి బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడ‌ని అనుకున్నారు. క‌ట్ చేస్తే అంద‌రి అనుమానాల‌కి పులిస్టాప్ పెట్టి పూర్తి క్లారిటీ ఇచ్చింది.

పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో బాయ్ ఫ్రెండ్ సౌర‌భ్ డింగ్రా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అతనితో దిగిన‌ ఫోటోల‌ని షేర్ చేస్తూ.. నాలోని లోపాల‌ని ప్రేమించే ఏకైక వ్య‌క్తికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. నిన్ను మంచి నాకెవ్వ‌రు ముఖ్యం కాదు. నీతో గ‌డ‌పిన ప్ర‌తి క్ష‌ణం నాకొక మ‌ధుర జ్ఞాప‌కం. హ్యాపీ బ‌ర్త్‌డే మేరేజాన్ అంటూ కామెంట్ రూపంలో తెలిపింది ఈ బోల్డ్ బ్యూటీ. మొత్తానికి వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా పాయ‌ల్ వాలంటైన్ ఎవ‌రో నెటిజ‌న్స్‌కి తెలిసిపోయింది.  సౌర‌భ్‌ ముంబయికి చెందిన మోడల్ అని తెలుస్తుంది. logo