ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితం ఈ అమ్మడు సౌరభ్ డింగ్రా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రియుడి తల్లి అనిత ఢింగ్రా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు ఆమె కోసం అందరు ప్రార్ధనలు చేయాలని, ఈ ప్రార్ధనలు అద్భుతాలను సృష్టించగలవంటూ కామెంట్ పెట్టింది.
దేవుడా.. దయచేసి అలా చేయకు’ అంటూ ఎమోషనల్ అవుతున్న పాయల్ రాజ్‌పుత్..ఢిల్లీలో ఓ వెంటిలేటర్ బెడ్, హర్యానాలోని సోనీపట్‌లో వెంటిలేటర్ అంబులెన్స్ కావాలి. ఎవరైనా సాయం చేయండి అని వేడుకుంది. సౌరభ్ తల్లి కరోనా వలన ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది.