గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 11:50:25

క‌రోనా టెస్ట్ : పాయ‌ల్ క‌ష్టాలు చూడండి!

క‌రోనా టెస్ట్ :  పాయ‌ల్ క‌ష్టాలు చూడండి!

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కాస్త త‌గ్గ‌డంతో సినిమా షూటింగ్స్ మొద‌ల‌య్యాయి. షూటింగ్స్‌లో పాల్గొనే న‌టీన‌టులు ముందుగా క‌రోనా టెస్ట్ చేయించుకొని ఆ త‌ర్వాత సెట్స్‌లో అడుగుపెడుతున్నారు. తాజాగా హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌ను సంత‌కం చేసిన ప్రాజెక్టుల షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సిద్ధ‌మైంది. ఇందుకోసం ముందుగా కరోనా టెస్ట్ చేయించుకుంది. 

పాయ‌ల్ ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా, స్వాబ్ తీసుకునే స‌మ‌యంలో పాయ‌ల్ తెగ భ‌య‌ప‌డింది. చిన్న పిల్ల‌లా అరుస్తూ రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పాయ‌ల్ టెస్ట్ స‌మ‌యంలో చాలా ఇబ్బందిగా ఫీల‌య్యాను అని చెప్పుకొచ్చింది. అయితే త‌నకు రిపోర్ట్‌లో నెగెటివ్ రావ‌డంతో ఆనందంగా ఉంద‌ని పేర్కొంది.  కాగా, పాయ‌ల్ రాజ్‌పుత్ కొద్ది రోజుల క్రితం ముంబై నుండి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. logo