సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 00:14:52

ఫేక్‌న్యూస్‌ ప్రచారం చేయొద్దు!

ఫేక్‌న్యూస్‌ ప్రచారం చేయొద్దు!

సోషల్‌మీడియాలో తన సినిమాల గురించి ఫేస్‌న్యూస్‌ ప్రచారం కావడం పట్ల కథానాయిక పాయల్‌రాజ్‌పుత్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. వార్తలు రాసేముందు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికింది. కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌-2’ అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రాల్లో ఈ అమ్మడు ఐటెంసాంగ్స్‌లో నర్తించబోతున్నదని కొన్ని మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. భారీ పారితోషికం ఆఫర్‌ చేయడంతో ఆమె ప్రత్యేకగీతాలకు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. వీటిపై పాయల్‌రాజ్‌పుత్‌ స్పందిస్తూ ‘ఆ సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. ప్రత్యేకగీతాల్లో నేను నటించబోవడం లేదు. ఈ సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి నా మొబైల్‌కు రోజూ వందల సందేశాలు వస్తున్నాయి. వాటన్నింటికి జవాబు చెప్పడం నాకు సాధ్యం కాదు. ఎలాంటి ఆధారం లేకుండా ఫేక్‌న్యూస్‌ ప్రచారం చేయకండి. ఏదైనా సినిమా అంగీకరిస్తే నా అఫీషియల్‌ సోషల్‌మీడియా ఖాతాల ద్వారా తెలియజేస్తా. ప్రస్తుతం లాక్‌డౌన్‌ విరామ సమయాన్ని నేను కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తున్నా’ అని పేర్కొంది. ఎక్కువ సమయాన్ని స్క్రిప్ట్‌లు వినడానికి కేటాయిస్తున్నానని, మహిళాప్రాధాన్యత ఉన్న మంచి సినిమా చేయాలన్నది తన ఆలోచనగా ఉందని పాయల్‌రాజ్‌పుత్‌ చెప్పింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ పంజాబీ సుందరి యువతరంలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో సైతం మెప్పించింది.


logo