గురువారం 04 మార్చి 2021
Cinema - Dec 23, 2020 , 00:34:00

పరిశోధనాత్మక థ్రిల్లర్‌

పరిశోధనాత్మక థ్రిల్లర్‌

పాయల్‌రాజ్‌పుత్‌ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘5 డబ్ల్యూస్‌' (ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). ‘సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు’ ఉపశీర్షిక. ప్రణదీప్‌ ఠాకోర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కైవల్య క్రియేషన్స్‌ పతాకంపై యశోద ఠాకోర్‌ నిర్మిస్తున్నారు. జనవవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘పరిశోధనాత్మక మిస్టరీ డ్రామా ఇది. పాయల్‌రాజ్‌పుత్‌ను సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. మునుపెన్నడూ చూడని విధంగా ఆమె నటనలో భిన్న పార్శాలు కనిపిస్తాయి. ఒక పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తితో తయారుచేసుకున్న కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనాలతో అలరిస్తుంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అనిల్‌ బండారి, సంగీతం: మహతి సాగర్‌, దర్శకుడు: ప్రణదీప్‌ ఠాకోర్‌.

VIDEOS

logo