మంగళవారం 26 మే 2020
Cinema - Apr 26, 2020 , 23:50:19

కార్తికేయ స్నేహితుడు మాత్రమే

కార్తికేయ స్నేహితుడు మాత్రమే

‘ఆర్‌ఎక్స్‌100’ చిత్రం ద్వారా గ్లామర్‌ తళుకులతో యువతరం హృదయాల్ని దోచుకుంది పంజాబీ ముద్దుగుమ్మ పాయల్‌రాజ్‌పుత్‌. లాక్‌డౌన్‌ విరామంలో ఆమె హాట్‌ఫొటోషూట్‌లతో దర్శనమిస్తోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించిందీ భామ. తొలి చిత్ర హీరో కార్తికేయతో డేటింగ్‌ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారని అడగ్గా..‘కార్తికేయ నాకు మంచి స్నేహితుడు..ఆ స్నేహం చాలు’ అంటూ బదులిచ్చింది.  తెలుగులో విజయ్‌దేవరకొండతో సినిమా చేసే అవకాశం కోసం  ఎదురుచూస్తున్నానని తెలిపింది. డబ్బు కంటే తాను ప్రేమకే ఎక్కువ విలువనిస్తానని బదులిచ్చింది పాయల్‌ రాజ్‌పుత్‌.


logo