తేజ దర్శకత్వంలో రూపొందిన ‘సీత’ చిత్రంలో ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసింది పాయల్ రాజ్‌పుత్. ఈ పాటలో గ్లామర్ తళుకులతో ఆకట్టుకున్నది. తాజాగా ఆమె మరోసారి ఐటెంసాంగ్‌లో నటించబోతున్నట్లు సమాచారం. నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘బంగార్రాజు’. 2016లో రూపొందిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పాయల్‌రాజ్‌పుత్ ప్రత్యేకగీతంలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా భారీ హంగులతో ఈ పాటను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. లాక్డౌన్ తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి సంక్రాంతికి విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారని చెబుతున్నారు.