శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 11:52:17

అనురాగ్‌కు లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు జ‌ర‌పాలి: పాయ‌ల్ ఘోష్‌

అనురాగ్‌కు లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు జ‌ర‌పాలి:  పాయ‌ల్ ఘోష్‌

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌ని లైంగికంగా వేధించాడంటూ పాయ‌ల్ ఘోష్ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గురువారం రోజు వెర్సోవా పాలసీ స్టేషన్‌లో కశ్య‌ప్‌ను దాదాపు ఎనిమిది గంటలు విచారించారు. ఈ విచార‌ణ‌లో ఆయ‌న పాయ‌ల్ వ్యాఖ్య‌ల‌ని ఖండిస్తూ, ఆ స‌మ‌యంలో తాను వేరే దేశంలో ఉన్న‌ట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పాయ‌ల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా .. క‌శ్య‌ప్ పోలీసుల ముందు అబ‌ద్దాలు చెప్పాడు. నిజ‌నిజాలు బ‌య‌ట‌ప‌డాలంటే క‌శ్య‌ప్‌ని  నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని కోరుతున్నాను. ఇందుకు సంబంధించి పోలీస స్టేష‌న్‌లో నా లాయ‌ర్ అప్లికేష‌న్ ఇవ్వ‌నున్నాడ‌ని తెలిపింది పాయ‌ల్.

అంత‌క‌ముందు క‌శ్య‌ప్ .. పాయ‌ల్ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ 2013 ఆగ‌స్ట్‌లో షూటింగ్ నిమిత్తం శ్రీలంక‌కు వెళ్లాను అని చెప్పారు. అందుకు సంబంధించి ఆధారాలు కూడా ఇచ్చారు. పాయ‌ల్‌తో నేనెప్పుడు అలా ప్ర‌వ‌ర్తించ‌లేదు అని అనురాగ్ క‌శ్య‌ప్ పేర్కొన్నారు.  

తాజావార్తలు