బుధవారం 27 మే 2020
Cinema - May 10, 2020 , 10:09:47

బీచ్ థెర‌పీ కావాలంటున్న బోల్డ్ బ్యూటీ..!

బీచ్ థెర‌పీ కావాలంటున్న బోల్డ్ బ్యూటీ..!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో యూత్ మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల సుంద‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఈ సినిమా త‌ర్వాత వెంక‌టేష్‌, ర‌వితేజ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయితే లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన పాయ‌ల్ త‌న సోషల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అలరిస్తుంది.

లాక్‌డౌన్‌లో త‌న ఫీలింగ్స్‌ని ప్ర‌తి రోజూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తున్న పాయ‌ల్ తాజాగా పాత వీడియో ఒక‌టి షేర్ చేసి బీచ్ థెర‌పీ కావాల‌ని ఉంద‌ని కామెంట్ పెట్టింది. దీనికి కొంద‌రు నెటిజ‌న్స్ కొద్ది రోజులు ఆగు, ఆ త‌ర్వాత అనుకున్న‌వి జ‌రుగుతాయి అని కామెంట్స్ పెడుతున్నారు.logo