మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 18:23:38

12 నెలల్లో 3 సినిమాలు..పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!

12 నెలల్లో 3 సినిమాలు..పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!

పవన్ కళ్యాణ్ సినిమా రెండేళ్లకు ఒకటి వస్తేనే పండగ చేసుకుంటారు అభిమానులు. అలాంటిది ఏడాదికి రెండు సినిమాలు చేస్తే పండగే. కానీ ఇప్పుడు ఏకంగా ఏడాదికి మూడు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్. అంతా చిరంజీవి పుణ్యమే అది. ఎందుకంటే సినిమాలు వరసగా చేయాలంటూ తమ్ముడిని బాగానే ఎంకరేజ్ చేసాడు చిరంజీవి. అందుకే అన్న మాట కాదనకుండా అరడజన్ సినిమాలు ఒకేసారి ఒప్పుకున్నాడు పవన్. ఇదిలా ఉంటే పవన్ కెరీర్ మొత్తంలో ఎప్పుడూ లేనంత బిజీగా ఇప్పుడే ఉన్నాడు. ముఖ్యంగా ఈయన గత సినిమా అజ్ఞాతవాసి 2018 సంక్రాంతికి విడుదలైంది. అంటే ఇప్పటికే మూడేళ్లైపోయిందన్నమాట. ఆ తర్వాత 2019 ఎన్నికలతో బిజీ అయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈయన సినిమా కెరీర్ ఊపందుకుంటుంది. 

వకీల్ సాబ్ సినిమా ఇప్పటికే పూర్తైపోయింది. ఏప్రిల్ లో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సినిమా వచ్చిన వచ్చిన నాలుగు నెలలకు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ విడుదల కానుంది. ఈ సినిమా కోసం రెండు నెలలు మాత్రమే డేట్స్ ఇచ్చాడు పవర్ స్టార్. సాగర్ కే చంద్ర సినిమాను అంత వేగంగా పూర్తి చేయనున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అంటే ఇప్పట్నుంచి మరో ఆర్నెళ్లకు పైగానే టైమ్ ఉందన్నమాట. అంటే సమ్మర్ తర్వాత సీజన్ కూడా పవన్ తీసుకుంటున్నాడన్నమాట. ఇవి కాకుండా క్రిష్ సినిమా కూడా లైన్ లోనే ఉంది. 

మరోవైపు ఈ సినిమాను కూడా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లకు పైగానే ఉందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. అంటే 2021 సమ్మర్‌లో వకీల్ సాబ్.. 2021 ఆగస్ట్ 15కి అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్.. 2022 సమ్మర్ కు క్రిష్ సినిమా విడుదల కానున్నాయి. 12 నెలల్లో 3 సినిమాలు విడుదల చేసి పవన్ తన కెరీర్ లోనే కొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. వీటితోపాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు కూడా లైన్ లోనే ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే కచ్చితంగా పవన్ అభిమానులకు పండగే మరి.

ఇవి కూడా చ‌ద‌వండి..

జాన్వీక‌పూర్ కు 'వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం ' న‌చ్చ‌లేదా..?

20 నిమిషాలు..కోటి రెమ్యున‌రేష‌న్..!

శృతిహాస‌న్ ప్రియుడు ఇత‌డే..ఫాలోవ‌ర్స్ కు క్లారిటీ !

అన‌సూయ‌ 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ ' ట్రైల‌ర్

‘ఓటిటి’ కాలం మొద‌లైన‌ట్టేనా..?

తండ్రికి స్టార్ హీరో విజయ్ లీగల్ నోటీసులు..!

వ‌రుణ్ ధావ‌న్ ఇక న‌టించ‌డేమో..? 'జెర్సీ' భామ‌ సెటైరిక‌ల్ పోస్ట్

చిక్కుల్లో నాని 'అంటే సుంద‌రానికి '..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo