సోమవారం 13 జూలై 2020
Cinema - Apr 03, 2020 , 16:10:29

సీఎం స‌హాయ‌నిధికి రూ.50 ల‌క్ష‌లు పంపిన ప‌వ‌న్‌

సీఎం స‌హాయ‌నిధికి రూ.50 ల‌క్ష‌లు పంపిన ప‌వ‌న్‌

ప్రపంచ మానవాళికి పెనువిపత్తుగా పరిణమించిన కరోనా మహమ్మారిపై పోరాటంలో తమవంతు పాత్ర పోషించేందుకు సినీప్రముఖులు ముందుకొస్తున్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వాలకు చేయూతగా భారీ విరాళాల్ని ప్రకటిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఇటీవ‌ల కరోనాపై పోరుకు మద్దతుగా అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ రెండు కోట్ల విరాళాన్ని ఇస్తున్న‌ట్టు ప్రకటించారు. 

గ‌తంలో చెప్పిన విధంగా  ప్రధాన మంత్రి సహాయనిధికి కోటి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున  విరాళాన్నిపంపిన‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.  కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి రెండు కోట్ల రూపాయ‌ల‌ని త‌దితర ప్ర‌భుత్వాల‌కి పంపాను అని  ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.


logo