సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 25, 2020 , 11:06:24

అఫీషియ‌ల్‌: మ‌రో చిత్రం ప్ర‌క‌టించిన ప‌వన్ క‌ళ్యాణ్‌

అఫీషియ‌ల్‌: మ‌రో చిత్రం ప్ర‌క‌టించిన ప‌వన్ క‌ళ్యాణ్‌

రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ మళ్ళీ రెండేళ్ళ తర్వాత పింక్ రీమేక్‌గా రూపొందిన‌ వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా, మ‌రి కొద్ది రోజుల‌లో రిలీజ్ కానుంది. ఇందులో లాయ‌ర్ గా క‌నిపించి అల‌రించ‌నున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు, బోని కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  

పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలోను ఓ సినిమా చేస్తుండ‌గా,  ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టేశాడు పవన్.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.  హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని ప్లాన్ చేశారు పవన్. త్వ‌ర‌లోనే దీనిని మొద‌లు పెట్టనున్నాడు. క‌ట్ చేస్తే ప‌వ‌న్ మ‌రో సినిమాకు సంబంధించి తాజాగా అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో సాగర్ కే చంద్ర ద‌ర్శ‌కుడిగా ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించ‌నున్నారు. ఈ సినిమాని అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నారు. సాగ‌ర్ గ‌తంలో అయ్యారే, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు చిత్రాలు తెర‌కెక్కించాడు. ఈ సారి సాగర్.. ప‌వ‌న్ తో ఎలాంటి ప్ర‌యోగాలు చేస్తాడో చూడాలి. కాగా,  అయ్యప్పనుం కోషియుం రీమేక్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పోలీస్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు