శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 23, 2021 , 11:15:42

మ‌రో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్..!

మ‌రో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాన్ వరుస సినిమాల‌తో అభిమానులలో జోష్ పెంచుతున్నాడు. రెండేళ్ళు ఒక్క సినిమా కూడా చేయ‌ని ప‌వ‌న్ ఇప్పుడు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి లైన్‌లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసిన ప‌వన్ ప్ర‌స్తుతం క్రిష్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీని త‌ర్వాత మాలీవుడ్‌లో హిట్ అయిన   ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్  చేయ‌నున్నాడు. ఇందులో బిజూ మీన‌న్ పాత్ర‌ను ప‌వ‌న్ చేయ‌నుండ‌గా, రానా పాత్ర‌ను పృథ్వీరాజ్ చేయ‌నున్నాడు. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ మూవీకి త్రివిక్ర‌మ్ మాట‌లు అందిస్తున్నాడు.

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోను, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలోను ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇప్పుడు బండ్ల‌గ‌ణేష్ నిర్మాణంలో రాక్ష‌సుడు ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మతో సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ర‌మేష్ వ‌ర్మ ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యాక ప‌వన్ సినిమా ప‌నులు మొద‌లు పెడ‌తాడ‌ట‌.

VIDEOS

logo