సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్,మహేష్ బాబు, ప్రభాస్ నిలవనున్న సంగతి కొద్ది రోజుల ముందే తెలిసింది. అయితే ఏ హీరో ముందు వస్తారు, ఏ హీరో చివరలో వస్తారనే దానిపై క్లారిటీ లేదు. ముందుగా రాధే శ్యామ్ చిత్ర మేకర్స్ జనవరి 14న తమ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇక జనవరి 13న సర్కారు వారి పాట రానున్నట్టు తెలియజేశారు. ఇక పవన్ భీమ్లా నాయక్ ఎప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు.
తాజాగా అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రానికి సంబంధించిన వీడియో విడుదల చేస్తూ మూవీని జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు స్పష్టం చేశారు. అంటే సంక్రాంతికి అందరికంటే ముందే పవన్ తన అభిమానులని ఎంటర్టైన్ చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. ఇప్పటికే రెండు మేకింగ్ వీడియోలతో పాటు ఫోటోలు కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలోని తొలిపాట విడుదల కాబోతుంది. శ్రీ కృష్ణ పాడనున్న ఈ పాటకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రస్తుతానికి ‘ప్రొడక్షన్ నెం.12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ఓ పవర్ఫుల్ పోలీస్ అఫీసర్‌గా కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి పవన్లుక్ని రివీల్ చేయడంతో పాటు షూటింగ్‌కి సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు చిత్ర యూనిట్.