వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.
రానా పాత్ర స్వరూప స్వభావాలను ఆవిష్కరిస్తూ ఒక టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. మరి దానికి ఎప్పుడు ముహూర్తం పెట్టారనే దానిపై క్లారిటీ లేదు. రానా అభిమానులు మాత్రం ఈ చిత్రం నుండి రానాకి సంబంధించి ఏదైన అప్డేట్ ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే భీమ్లా నాయక్ నుండి పవన్ మాస్ డైలాగ్ ఒకటి లీకైనట్టు తెలుస్తుంది. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మూవీ నుండి ఏదో ఒకటి లీక్ కావడం ఆందోళన కలిగిస్తుంది. వకీల్ సాబ్ చిత్రీకరణ సమయంలోను చాలా లీకులు బయటకు వచ్చాయి. భీమ్లా నాయక్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ‘సంక్రాంతి’ పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.