శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 11:14:34

కాషాయ దుస్తుల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

కాషాయ దుస్తుల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

కొద్ది రోజుల క్రితం వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త మూడు రోజులుగా తిరుప‌తిలో పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు.  ఆలయం నుంచి వస్తున్న జనసేనానిని ఫొటో గ్రాఫ‌ర్స్ కెమెరాలో బంధించ‌గా ఆయ‌న ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. కాషాయ దుస్తుల‌లో ప‌వ‌న్‌ని చూసిన ఫ్యాన్స్ ముగ్ధుల‌వుతున్నారు.

జ‌న‌వ‌రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రిష్ సినిమాను మొద‌లు పెట్టాల‌ని భావిస్తుండ‌గా, ఈ సినిమాని కేవలం నెల రోజుల‌లోనే పూర్తి చేస్తార‌ట‌. ఆ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ద‌ర్వ‌కత్వంలో ఓ చిత్రం, మ‌ల‌యాళ రీమేక్ చిత్రాలు చేయ‌నున్నాడు. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌న్ కోషియుమ్‌కు రీమేక్‌గా తెర‌కెక్క‌నున్న చిత్రంలో రానా కూడా న‌టిస్తున్నాడు. గ‌త రెండేళ్లుగా ప‌వ‌న్ సినిమా ఒక్క‌టి కూడా విడుద‌ల కాక‌పోవ‌డంతో ఆయ‌న సినిమాల కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

VIDEOS

logo