శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Feb 25, 2020 , 11:41:28

ప‌వ‌న్ సినిమాలో విల‌క్ష‌ణ న‌టుడు..!

ప‌వ‌న్ సినిమాలో విల‌క్ష‌ణ న‌టుడు..!

హిందీలో భారీ విజ‌యం సాధించిన పింక్ చిత్రాన్ని ప‌వ‌న్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన కోర్ట్ రూమ్ సెట్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్టు తెలుస్తుంది.  విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ చిత్రంలో లాయ‌ర్‌గా కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు ఫిలిం గ‌న‌ర్ స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌కాశ్ రాజ్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకే హైలైట్ కానున్నాయ‌ని అంటున్నారు.  మహిళా సాధికారత ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో  ఇద్దరు అనుభవజ్ఞులైన నటులు  అద్భుత ప‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బరుస్తున్నార‌ని తెలుస్తుంది. వేణు శ్రీరామ్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. లాయ‌ర్ సాబ్, వ‌కీల్ సాబ్ అనే ప‌లు టైటిల్స్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది. థ‌మ‌న్ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు


logo